భీమిలిలో వైసీపీకి ఎదురుదెబ్బ.. పార్టీ వీడిన చిన్న శ్రీను
రిపోర్టర్: కిరణ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు పార్టీని వీడటంతో ఆ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది. స్థానిక ఎన్నికల ముందే ఆయన టీడీపీలో చేరడంతో వైసీపీలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన నేతలు కూడా పార్టీని వీడటంతో అధిష్టానం ఇప్పుడు ప్రత్యామ్నాయ నాయకత్వంపై దృష్టి సారించాల్సి వస్తోంది.