కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం: ఎనర్జీ స్టోరేజ్ పథకానికి గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని పటిష్టం చేసే దిశగా కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు తొంబై రెండు గిగావాట్ల గ్రిడ్ స్కేల్ ఎనర్జీ స్టోరేజ్ పథకంతో పాటు ఇరవై నాలుగు రకాల క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ ప్రణాళికకు ఆమోదం తెలిపామని ఆయన స్పష్టం చేశారు. అలాగే జాతీయ గణాంక వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ. 4,371 కోట్ల భారీ నిధులను కేటాయించినట్లు తెలిపారు.