సెకండ్ హ్యాండ్ పొగతో భారత్‌లో పెరుగుతున్న ముప్పు!
రిపోర్టర్: గోపి
స్థలం: India
ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ పొగ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం, 2023లో భారత్‌లో దాదాపు 44.4 కోట్ల మంది సెకండ్ హ్యాండ్ పొగ బారిన పడ్డారు. దీనివల్ల దేశంలో 3.25 లక్షలకు పైగా మరణాలు సంభవించినట్లు వెల్లడైంది. పొగతాగని వారు కూడా ఈ పరోక్ష ధూమపానం వల్ల తీవ్రమైన గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.