దిల్లీలో ఏపీ భవన్‌ బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం

రిపోర్టర్: కృష్ణ స్థలం: దిల్లీ

దిల్లీలోని తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఏపీ భవన్‌లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. రేషన్‌కార్డు ఉన్నవారు సబ్సిడీ ధరకు నాణ్యమైన బియ్యం కొనుగోలు చేయవచ్చని తెలిపారు. త్వరలోనే ఇందులో మీమార్ట్‌ సేవలతో పాటు ఎన్‌సీసీఎఫ్‌ ద్వారా 64 రకాల సరకులను సబ్సిడీకి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.