అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతున్న కావలి వెటరన్ క్రీడాకారిణి కోటేశ్వరమ్మ

రిపోర్టర్: రమేష్ స్థలం: కావలి

కావలి పట్టణానికి చెందిన విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయురాలు ఏనుగుల కోటేశ్వరమ్మ వెటరన్ క్రీడాకారిణిగా అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారు. స్వీడన్, అమెరికా, జర్మనీ దేశాల్లో జరిగిన ప్రపంచ అథ్లెట్ పోటీల్లో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. 1989 నుంచి పోటీల్లో రాణిస్తున్న ఆమె, ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సుమారు 450 పతకాలు సొంతం చేసుకున్నారు. విదేశీ పోటీల్లోనూ పాల్గొంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నట్లు కోటేశ్వరమ్మ ఆనందం వ్యక్తం చేశారు.