మహిళా అధికారిపై దురుసు ప్రవర్తన: జమ్ముకశ్మీర్ ప్రభుత్వ విచారణకు ఆదేశం
రిపోర్టర్: రాజేష్
స్థలం: శ్రీనగర్
మహిళా సహోద్యోగిపై దురుసుగా ప్రవర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్ రాజీవ్ రంజన్ వ్యవహారంపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఆన్లైన్ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ బీనిష్ వానిపై బూతు మాటలతో విరుచుకుపడిన ఘటనపై సీనియర్ ఐఏఎస్ మన్దీప్ కౌర్‌ను విచారణ అధికారిగా నియమించినట్లు అధికారులు తెలిపారు. బాధితురాలపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని సీఎం ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.