హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా మార్చాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్లు Telangana CMO వెల్లడించారు. జూబ్లీ హిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.