ఆసియా కప్ ఫైనల్లోకి భారత మహిళల క్రికెట్ జట్టు

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

మహిళల ఆసియా కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షఫాలీ వర్మ రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 109 పరుగులకే పరిమితమైంది. దీప్తి శర్మ మూడు వికెట్లతో చెలరేగింది. ఈ విజయంతో భారత జట్టు ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.