క్యాన్సర్ బాధితుడు లక్ష్మణ్ ముదిరాజ్‌కు కేటీఆర్ భరోసా, ఆర్థిక సాయం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Kukatpally, Hyderabad

కూకట్‌పల్లికి చెందిన ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ స్టేజ్-4 క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫోన్ ద్వారా ఆయనకు ధైర్యం చెప్పారు. కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ చైర్మన్ జగన్, లక్ష్మణ్ నివాసానికి వెళ్లి పరామర్శించి, తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.