ఏపీలో మరో ఏడాది పాటు వైన్ షాపుల లైసెన్సులు పొడిగింపు!

రిపోర్టర్: అశోక్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఎక్సైజ్ పాలసీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,736 మద్యం దుకాణాల లైసెన్సులను మరో ఏడాది పాటు పొడిగించింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. గడువులోగా రెన్యువల్ చేసుకోని దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించనున్నారు. అక్రమాలను అరికట్టేందుకు ప్రతి దుకాణంలో సీసీటీవీలు, ఏఐ నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, సమాచారం ఇస్తే లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు.