వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
తెలంగాణలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలోనే ఉదయ్ పథకం కింద కేంద్రంతో ఒప్పందాలు జరిగాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ విషయంలో తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, పంపుసెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు ఏర్పాటు చేయబోమని తేల్చి చెప్పారు.