ఎన్నికల్లో అక్రమాల అనుమతి దేశద్రోహంతో సమానమన్న ప్రియాంకా గాంధీ

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: కేరళ

ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వాటిని అనుమతిస్తే అది దేశద్రోహం, రాజద్రోహమే అవుతుందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాయనాడ్ నిలంబూర్లో విలేకరులతో మాట్లాడుతూ ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి అత్యంత తీవ్రమైన సమస్య అని, ఎన్నికలే సక్రమంగా లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.