విదేశాల నుంచి బొగ్గు తెప్పించడంపై సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ధ్వజం

రిపోర్టర్: రాము స్థలం: మంచిర్యాల

సింగరేణి బొగ్గును పక్కనబెట్టి విదేశాల నుంచి బొగ్గు తెప్పించడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంచిర్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పుష్కలంగా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ విదేశీ దిగుమతుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యల వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణి కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఈ అసంబద్ధ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.