యానాం మార్కెట్‌లో రికార్డు ధర పలికిన గోదావరి పులస చేప
రిపోర్టర్: నరేష్
స్థలం: యానాం
యానాం మార్కెట్‌లో గోదావరి పులస చేప రికార్డు స్థాయిలో రూ.26 వేలు పలికింది. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప సమీపంలో నదిలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఈ అరుదైన చేప చిక్కింది. యానాం మార్కెట్‌లో నిర్వహించిన బహిరంగ వేలంలో కాకినాడకు చెందిన వ్యక్తి దీనిని దక్కించుకున్నారు. ప్రస్తుత సీజన్‌లో పులసకు ఇంత భారీ ధర పలకడం ఇదే మొదటిసారని స్థానిక మత్స్యకారులు తెలిపారు.