పుంగనూరులో ఉద్రిక్తతలు: పోలీసు నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన మిథున్ రెడ్డి

రిపోర్టర్: వెంకట్ స్థలం: పుంగనూరు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వంలో ఉద్రిక్తతల నేపథ్యంలో పుంగనూరు రావద్దంటూ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించారు. ఈ పరిణామాలపై ఆయన హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ, పోలీసుల తీరుపై న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.