విజయనగరం జిల్లాలో ప్రజలతో మమేకమవుతున్న పల్లెనిద్ర కార్యక్రమం

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల శాంతిభద్రతల పరిరక్షణకు మరియు ప్రజలతో పోలీసుల మధ్య సత్సంబంధాలను పెంపొందించడానికి పల్లెనిద్ర కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది. ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, మాదకద్రవ్యాలు మరియు గంజాయి కట్టడిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.