వైరల్ వీడియో: పాస్‌పోర్ట్‌ను రఫ్ నోట్బుక్గా మార్చేసిన వ్యక్తి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Kerala
పాస్‌పోర్ట్ లోని ఖాళీ పేజీలను ఫోన్ నంబర్లు రాసుకోవడానికి, లెక్కలు వేసుకోవడానికి ఉపయోగించిన ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. కేరళలోని పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతీయుల వినూత్న ఆలోచనపై పలువురు సరదాగా కామెంట్లు చేస్తుండగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది.