చెరువుల చెంత వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

రిపోర్టర్: Raju Reporter స్థలం: ఆత్మకూర్

ఆత్మకూర్ మండలంలో వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. చెరువు వద్ద స్థలాన్ని పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా పరిసరాలను శుభ్రం చేయించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా తగు ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని సర్పంచ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంబోజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.