దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్న మహేందర్
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులు తమ పంటను విక్రయించాలని రేణిగుంట పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్ కోరారు. శుక్రవారం పలు గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.