భూ భారతి కాదు.. అది భూ హారతి: హరీశ్ రావు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

భూ భారతి పేరుతో రాష్ట్రంలో భారీ భూ కుంభకోణాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆధారాలతో సహా అక్రమాలను బయటపెట్టారు. గజ్వేల్‌లో వృద్ధురాలి భూమిని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో తిరుపతిరెడ్డి భూ కుంభకోణాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని తీసేసి భూ భారతిని తీసుకొచ్చి కబ్జాలకు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.