'రౌడీషీటర్లతో కుమ్మక్కై వసూళ్లు': రాజేంద్రనగర్ జోన్ అధికారి ఆగడాలపై ఫిర్యాదు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

రాజేంద్రనగర్ జోన్ పరిధిలో ఓ పోలీసు అధికారి రౌడీషీటర్లతో కుమ్మక్కై భూ పంచాయితీలు, సెటిల్‌మెంట్ల పేరుతో అమాయకులను తీవ్రంగా వేధిస్తూ లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ బాధితులు సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా పీటీ కేసులు కూడా పెట్టకూడదని ఆంక్షలు విధిస్తూ, స్థానిక ఎస్సైల సహకారంతో అక్రమాలకు పాల్పడుతున్న ఆ అధికారి ఆగడాలపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.