ప్రశ్నించిన యువకుడిని కొట్టిన బీజేపీ మంత్రిపై రాహుల్ గాంధీ ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
ఢిల్లీలో రోడ్డు తవ్వకాలపై వీడియో తీస్తున్న యువకుడిపై బీజేపీ మంత్రి చేయి చేసుకోవడం అత్యంత హేయమైన చర్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లంటే కనీస భయం లేకుండా పాలకులు అహంకారంతో ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దేశంలో అధికారంలో ఉన్న నాయకులు విచక్షణ కోల్పోయి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.