మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు సిద్ధం: కివీస్ బ్యాటర్ ఫిన్ అలెన్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Auckland
న్యూజిలాండ్ జట్టు తరఫున మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆ జట్టు డాషింగ్ ఓపెనర్ ఫిన్ అలెన్ స్పష్టం చేశారు. రాబోయే రెండు వన్డే మ్యాచ్ లలో కొత్త పాత్రను పోషించడం తనకు ఎంతో ఉత్తేజాన్నిస్తోందని ఆయన తెలిపారు. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ మిడిల్ ఓవర్లలో జట్టుకు ఉపయోగపడేలా ఆడటమే తన ప్రధాన లక్ష్యమని ఫిన్ అలెన్ వెల్లడించారు.