దీపావళి పటాకులపై విమర్శల దాడి: కపటత్వాన్ని ఎండగట్టిన నటి పవిత్ర పునియా
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
దీపావళి పటాకుల కాల్చివేతపై కొందరు చేస్తున్న విమర్శలను నటి పవిత్ర పునియా తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం పండుగల సమయంలోనే పటాకులపై ఆంక్షలు ఎందుకని, పెళ్లిళ్లు ఇతర వేడుకల్ లో మోత మోగినప్పుడు ఈ నిబంధనలు ఏమవుతాయని ఆమె ప్రశ్నించారు. జంతు ప్రేమికురాలైన తాను మూగజీవాల రక్షణకు కట్టుబడి ఉన్నానని, అయితే ఇతర భారీ శబ్దాలకు కూడా అవి భయపడతాయని ఆమె స్పష్టం చేసినట్లు ప్రముఖ మీడియా పేర్కొంది.