తిరుమల బ్రహ్మోత్సవాల వేళ ఎస్ఎస్డి టోకెన్లపై భక్తులు అప్రమత్తంగా ఉండాలి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్ల జారీపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను భక్తులు నమ్మవద్దని టీటీడీ సూచించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తాజా సమారాన్ని తెలుసుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.