సూర్యాపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం డాక్టర్ సజీవదహనం
రిపోర్టర్: రమేష్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట-ఖమ్మం 365 జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన వోల్వో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యారు. మృతుడిని ఖమ్మం మమతా హాస్పిటల్ ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.