అర్నబ్ తుపాను నష్టంపై సహాయం కోరిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Amaravati
అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రికి వివరించినట్లు ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు ఆయనతో మాట్లాడి సహాయం కోరినట్లు వెల్లడించారు. ఏపీకి విద్యుత్ సిబ్బందిని, సామాగ్రిని పంపేందుకు తమిళనాడు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని, ఇప్పటికే తెలంగాణ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన స్పష్టం చేశారు.