'ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు': ఏపీ భవన్లో ప్రత్యేక రైస్ అవుట్‌లెట్ ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

ఏపీ భవన్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక రైస్ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, నిత్యవసర సరుకులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలకూ అత్యుత్తమ నాణ్యతతో కూడిన సరుకులు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.