తుపాను విషాదంలో కోల్పోయిన కుటుంబాలను పరామర్శించిన కూటమి నాయకులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం గ్రామంలో గత తుపాను కారణంగా మృతి చెందిన కుటుంబాలను కూటమి నాయకులు గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం వారికి వంద కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆదుకున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం మరియు నాయకులు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.