స్మృతి మంధాన ఫిట్నెస్ సీక్రెట్స్: చిన్ననాటి కఠిన సాధనను వెల్లడించిన స్టార్ బ్యాటర్

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన చిన్ననాటి కఠినమైన ఫిట్నెస్ షెడ్యూల్, ఆటపై దృష్టి పెట్టిన విధానం గురించి రాజ్ షమానీ పాడ్కాస్ట్ షోలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున ఐదు గంటలకే మొదలయ్యే తన రోజులో సూర్య నమస్కారాలు, హై-ఇంటెన్సిటీ వర్కౌట్లు, షాడో బ్యాటింగ్ వంటి కఠినమైన దినచర్యను ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా పాటించినట్లు ఆమె వెల్లడించారు.