గోవాలో 'గోవా ఫస్ట్' కూటమిని ప్రకటించిన కేజ్రీవాల్
రిపోర్టర్: శివ
స్థలం: గోవా
గోవాలో 2027 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీలు కలిసి 'గోవా ఫస్ట్' పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. పనాజీలో జరిగిన సమావేశంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ పొత్తును ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు వేర్వేరుగా కనిపించినా లోపల ఒక్కటేనని, గోవా ప్రజలను రెండుసార్లు మోసం చేశాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.