మణిపూర్‌లో దారుణం: దాడుల్లో నలుగురు మృతి, బాలుడికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మణిపూర్

మణిపూర్ లోని తమెంగ్ లాంగ్, నోనీ జిల్లాల్లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎల్ టోలెన్ గ్రామంలో జరిగిన దాడిలో దంపతులు మృతి చెందగా, వారి ఆరేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో ఘటనలో ఇద్దరు హత్యకు గురయ్యారు. కుకీ సంఘాలు ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ 24 గంటల బంద్ కు పిలుపునిచ్చాయి.