ప్రశాంతి నగర్ లో పంచకర్ల రమేష్ బాబు పర్యటన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా జీవీఎంసీ 96వ వార్డు ప్రశాంతి నగర్ రోడ్డులోని యదువంశీ ఆయతనం రెసిడెన్సీలో జీవీఎంసీ అధికారులతో కలిసి పంచకర్ల రమేష్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన గుర్తించి, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.