వినాయక నిమజ్జనాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని కలెక్టర్ ఎస్పీ సూచన

రిపోర్టర్: హరి స్థలం: జగిత్యాల

ధర్మపురి మరియు రాయపట్నం గోదావరి వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. నిమజ్జనాలను భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు.