టెక్కీల కష్టాలపై మైక్రోసాఫ్ట్ ఉద్యోగి సెటైరికల్ వీడియో వైరల్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగుల పనితీరు, తొలగింపుల భయంపై సిద్ధ్ అనే ఉద్యోగి రూపొందించిన సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని నెటిజన్లు తెలిపారు. ఆఫీసుల్ లో విలాసాల కంటే ఎక్కువ పనిగంటలు, జాబ్ లాస్ టెన్షన్ ఉంటాయని ఆయన తన ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా వ్యంగ్యంగా వెల్లడించారు. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకున్న ఈ వీడియో టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది.