పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కోడ్ 100 అలర్ట్లో ఇరాన్ సైన్యం

రిపోర్టర్: విజయ్ స్థలం: World

పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారడంతో ఇరాన్ తన బలగాలను కోడ్ 100 అత్యవసర అలెర్ట్ లో ఉంచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంప్ డేవిడ్ పర్యటన రద్దు చేసుకుని వైట్ హౌస్ కు చేరుకోగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులకు తెగబడటంతో అంతర్జాతీయంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.