విజయవాడ దుర్గగుడి నకిలీ టికెట్ల కుట్ర భగ్నం చేసిన పోలీసులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో దసరా శరన్నవరాత్రుల సేవ, దర్శన టికెట్ల పేరిట భక్తులను మోసగించేందుకు యత్నించిన సైబర్ నేరస్థుడిని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. కావలికి చెందిన ఓ భక్తురాలి అప్రమత్తతతో ఈ నకిలీ టికెట్లాగో బయటపడింది. పాత గుంటూరుకు చెందిన నిందితుడు ఎడిటింగ్ యాప్ ద్వారా నకిలీ టికెట్ సృష్టించి మోసాలకు పాల్పడ్డాడని, భక్తులు అనధికారిక లింకుల ద్వారా టికెట్లు కొని మోసపోవద్దని సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న హెచ్చరించారు.