ట్రాక్టర్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు!
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ట్రాక్టర్లపై పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్‌లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. డ్రంక్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని డ్రైవర్లను హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలను పాటించని వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తున్నారు.