తుపాన్ల నష్టంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్షేత్రస్థాయి పరిశీలన
రిపోర్టర్: సునీల్
స్థలం: Prakasam
రెండు తుపాన్ల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ శాఖకు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాల్ లో ఆయన పర్యటించారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే పూర్తిస్థాయిలో సరఫరా పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు.