ఆళ్లగడ్డలో 48 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత
రిపోర్టర్: రాము
స్థలం: నంద్యాల
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించడం జరిగిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆళ్లగడ్డలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 48 బాధిత కుటుంబాలను గుర్తించి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.