పామూరులో దళితుల భూముల ఆక్రమణలపై కనిగిరి డీఎస్పీకి బాధితుల ఫిర్యాదు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పామూరు

పామూరు పరిధిలో దళితుల భూములు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని దళిత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుంటగాని పేతురు కనిగిరి డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన డీఎస్పీ చట్టపరమైన చర్యలుంటాయని హామీ ఇచ్చారు.