బీఆర్ఎస్ తప్పిదాల వల్లే నీటి కష్టాలంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
గతంలో కృష్ణా నదిలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని భువనగిరి లోక్సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం వద్ద నీటిని ఎత్తిపోసేందుకు కనీసం 93.5 మీటర్ల మట్టం కావాల్సి ఉండగా, ప్రస్తుతం 89 మీటర్ల ప్రవాహం మాత్రమే ఉందని ఆయన తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆయన, ఎల్నినో సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు.