ఎన్నికల కమిషన్ కార్యాలయం తగలబడిపోతుందంటూ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే కార్యాలయంతో పాటు నగరం తగలబడిపోతుందని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో బీజేపీతో కుమ్మక్కై వేల సంఖ్యలో ఓట్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు చోరీకి పాల్పడుతున్న అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని లేదంటే ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.