గురువులపై దాడి చేసిన రౌడీలను వదిలిపెట్టబోమని లోకేష్ వార్నింగ్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: రాప్తాడు

రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో టీడీపీ నేత నారా లోకేష్ వైకాపా శ్రేణులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులపై దాడి చేసిన రౌడీ మూకలను ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చి జైల్లో వేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే డేట్, టైమ్ ఫిక్స్ చేయాలని, డీఎస్సీ మరియు కల్తీ మద్యంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు.