స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో మోటోరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ
రిపోర్టర్: మహేష్
స్థలం: ఇండియా
ప్రముఖ టెక్ దిగ్గజం మోటోరోలా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా సిగ్నేచర్ 27ను స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ 2026 వేదికగా మంగళవారం అధికారికంగా ఆవిష్కరించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ Gen 6 చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ LYTIA 910 మెయిన్ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అమర్చారు. ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్ పాంటోన్ కోల్ స్మోక్, పాంటోన్ కాపులెట్ గ్రీన్ రంగుల్లో లభించనుందని కంపెనీ తెలిపింది.