తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆస్తులు పెంచుకున్నారంటూ మంత్రి వివేక్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: సిద్దిపేట

తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులు అక్రమంగా ఆస్తులు పెంచుకున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం పేరు మీద మూడు వందల ఎకరాలు ఉన్నాయని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను నాశనం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు దీనికి వెంటనే సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.