జూరాల రైతులకు అండగా బీఆర్ఎస్ ధర్నా పిలుపు నేపథ్యంలో లక్ష్మారెడ్డి హౌస్ అరెస్ట్
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలు కనపడట్లేదని, రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. జూరాల ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పిలుపునిచ్చిన ధర్నా నేపథ్యంలో అప్పన్నపల్లి సమీపంలోని తిరుమలహిల్స్ నివాసంలో మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జూరాలలో 8.5 టీఎంసీల నీళ్లు ఉన్నప్పటికీ పంటలకు సాగునీరు విడుదల నిలిపివేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.