ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూయార్క్
ఐక్యరాజ్యసమితి 81వ సాధారణసభ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అడ్రెస్ ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఇరాన్ తన వాదనను అంతర్జాతీయ వేదికపై గట్టిగా వినిపించేందుకు సిద్ధమవుతోంది. మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా-ఇరాన్ సంబంధాలు మరింత క్షీణించాయి.