గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై పవన్ కల్యాణ్‌ను అభినందించిన చంద్రబాబు నాయుడు
రిపోర్టర్: విజయ్
స్థలం: చిత్తూరు
గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించి డోలీ మోతలకు చరమగీతం పాడేలా అడవితల్లి బాట కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. తొలిదశను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు అడవితల్లి బాట 2.0 ద్వారా మరో 1,341 ఆవాసాలకు రెండు వేల ఐది రెండు కోట్ల రూపాయల నిధులతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఈ పోస్టులో ఆయన పేర్కొన్నారు.