యలమంచిలిలో నూతన గృహాలు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా నూతన గృహాలు మంజూరైన 172 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ ప్రొసీడింగ్ కాపీలను అధికారికంగా అందజేసినట్లు సుందరపు విజయ్ కుమార్ అనకాపల్లి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను అందించి వారిని అభినందించారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.